బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం తలకోన మార్గంలో రోడ్డుపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అటుగా వెళ్లే ప్రయాణికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే రీతిలో వర్షం కొనసాగితే వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది.