AP: పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్లే వారిని బాల కార్మికులుగా మార్చారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడలోని స్థానిక పీఆర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఉపాధ్యాయులు ఇసుక, ఇటుకలు మోయించారు. స్కూల్ పాత భవనం పడగొట్టి కొత్త బిల్డింగ్ కడుతుండగా.. పిల్లలతోనే పనులు చేయించారు. దాంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.