ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా సమయ వేళలు పాటించే విధంగా దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య ఆదేశించారు. మంగళవారం పలాస నియోజకవర్గం మందస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రార్ధనా సమయంలో ఆకస్మికంగా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయ వేళలు పాటించగలిగితే విద్యా బోధన ఒక సరళిలో కొనసాగుతుందని అన్నారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.