ఎచ్చెర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఆబోతుల వెంకటనాయుడు నియమిస్తూ పిసిసి అధ్యక్షురాలు షర్మిలరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు రణస్థలం ఆ పార్టీ కార్యాలయం నుండి ప్రకటనలో తెలిపారు. ఎచ్చెర్లతో పాటు మరో 61 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ లను నియమించారు. వెంకటనాయుడు మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా పార్టీలో సేవలు అందించినందుకు గుర్తించి పార్టీ ఇన్ఛార్జ్ గా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు.