ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని లావేరు శాఖా గ్రంథాలయాధికారి మురపాక శ్రీనివాసరావు అన్నారు. గ్రంధాలయంలో ఆదివారం విద్యార్థులు వివిధ రకాలైన పుస్తకాలను చదువుకున్నారు. సోమవారం నుండి శనివారం వరకు విద్యార్థులు పాఠశాలలలోనే క్లాస్ పుస్తకాలు చదువుతారని ఆదివారం గ్రంథాలయానికి వచ్చి బాల సాహిత్యంతో పాటు అన్ని రకాల పుస్తకాలను చదువుకోవచ్చు అని పుస్తక పఠనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని శ్రీనివాసరావు అన్నారు.