ప్రజలఫై భారాలు మోపే విద్యుత్ ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని బుధవారం డిమాండ్ చేసారు. ఈ మేరకు ఎచ్చెర్ల విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ప్రజల పాలిట ఉరితాళ్ళుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రక్రియ నిలిపివేయాలన్నారు.