బూర్జ మండలం పాలవలస గ్రామంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పాలవలస ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వందరోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఎమ్మెల్యే వివరించారు. స్వచ్ఛభారత్, పచ్చదనం పరిశుభ్రతపై విద్యార్థులు అవగాహన ఉండాలి అన్నారు.