ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో ఆగస్టు 23న గ్రామపంచాయతీ తీర్మానం లేకుండానే పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, వాటిని రద్దుచేసి గ్రామపంచాయతీ ప్రథమ పౌరులకు తగు ప్రాధాన్యత కల్పించాలని తొగరాం గ్రామ సర్పంచ్ తమ్మినేని వాణి సీతారాం బుధవారం కోరారు. జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో ఆమదాలవలస మండల ఎంపీటీసీలతో కలిసి వినతి పత్రం సమర్పించారు.