నందిగాం-1 రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాల దరఖాస్తు చేసుకొనే విధానంపై మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ వర్మ అవగాహన సదస్సు నిర్వహించారు. కౌలు రైతులు తప్పనిసరిగా సాగు హక్కు పత్రానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పంట బీమా, అన్నదాత సుఖీభవతో పాటు, ఎరువులు పురుగు మందుల సబ్సిడీ తదితర లబ్ధిని పొందవచ్చన్నారు.