వైసీపీ డాక్టర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన మాజీ మంత్రి డా. సీదిరి అప్పలరాజుని ఆదివారం వైసీపీ యువ నాయకులు డా. ధర్మాన కృష్ణ చైతన్య కలిశారు. అనంతరం శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. అతనితో పాటు ఎంపీపీ మురళీధర్, వాన గోపి, జడ్పీటీసీ రామారావు, సుడా మాజీ ఛైర్మన్ గుప్త, కన్వీనర్లు జగన్, నరసింగరావు పాల్గొన్నారు.