అంతర్జాతీయ బాలికా విద్యా దినోత్సవం బుధవారం ఇచ్చాపురం పాఠశాలలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ ఉపాధ్యాయులు మరియు సామాజిక కార్యకర్త పూజారి రమణమూర్తి హాజరైనారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువు మాత్రమే అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లల భవిష్యత్తుకు చక్కని బాట వేయడంతో పాటు వారిని సురక్షిత పౌరులుగా తీర్చిదిద్దడం ముఖ్యమని అన్నారు.