గతంలో ఫ్యాన్ గుర్తుపై గెలిచిన ఎంపీపీ కూడా తమకు అన్యాయం చేశారని ఆముదాలవలస మండలం తొగరాం సర్పంచ్ తమ్మినేని వాణి సీతారాం శనివారం నిరసన చేపట్టారు. ఆముదాలవలస మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు బదులు వారి ప్రతినిధులు పాల్గొనడం, సమస్యలకు పరిష్కారం చూపకపోవడం వంటి వాటిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసి సభ నుండి వాకౌట్ చేశారు.