యల్లనూరు మండలంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి పంట నష్టపరిహారం విషయమై శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ సోదరి బండారు కిన్నెర శ్రీ అనంతపురం జాయింట్ కలెక్టర్ నారాయణ్ శర్మ దృష్టికి శనివారం తీసుకెళ్లారు. అనంతపురం కలెక్టరేట్లో కలిసి నష్టం వివరించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాని నేపథ్యంలో రైతులకు నష్టపరిహారం అందించేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ను కోరారు.