మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి హత్య కేసులో ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేశారు. రాయదుర్గం పీఎస్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ రవిబాబు మాట్లాడుతూ రాయదుర్గానికి చెందిన పవన్, మధుసూదన్, కొల్లప్ప ముగ్గురూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పవన్, మధుసూదన్ నుంచి కొల్లప్ప డబ్బు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో విభేదాలు తలెత్తి కొల్లప్పను చంపారన్నారు.