రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మంగళవారం విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 61వ డివిజన్ ప్రకాష్ నగర్ లో స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరిటాల సునీత ఇంటింటికీ వెళ్లి అక్కడ జరుగుతున్న పరిశుద్ధ్య పనులను పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.