జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు 9, 10వ తేదీలలో ఎన్నికలసంఘం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు ఎన్నికలవిధులు సక్రమంగా నిర్వహించాలని తహశీల్దార్ విజయ్ కుమారి శుక్రవారం సూచించారు. రెవెన్యూ సిబ్బంది, బీఎల్దలతో సమావేశం నిర్వహించారు. 18 ఏళ్ల నిండిన ప్రతిఒక్కరూ ఓటుహక్కు నమోదు చేసుకునేలా బీఎల్వోలు చూడాలని అన్నారు. ఆస్ఐ కరుణాకర్, వీఆర్వోలు, బీఎల్వోలు పాల్గొన్నారు.