మడకశిర నియోజకవర్గం, బుల్లసముద్రం గ్రామ ప్రజలు నీటి సమస్యతో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో మడకశిర శాసనసభ్యులు గ్రామానికి నీటి సమస్య తీరుస్తానని మాట ఇచ్చారు. అదే ప్రకారంగా శనివారం బుల్లసముద్రం గ్రామంలో బోరు వేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, తదితరులు పాల్గొన్నారు.