ఉరవకొండ మండలంలోని వివిధ ఫర్టిలైజర్ షాపులను గుత్తి ఏడీఏ వెంకటరాముడు ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారి శుభకర తనిఖీ చేశారు. శుక్రవారం తనిఖీల్లో భాగంగా అమ్మకాల మధ్య తేడాలను గుర్తించి షాప్ యజమానులను మందలించారు. ఫర్టిలైజర్స్ అమ్మకాలకు ఆన్లైన్ అమ్మకాలకు తేడా రాకుండా చూసు కోవాలని హెచ్చరించారు. లేకుంటే యజమానులపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని తెలిపారు.