ఎన్ పి కుంట మండలం గౌకనపల్లిలో ఉపాధి పని చేస్తూ పని ప్రదేశంలో బుధవారం చనిపోయిన షేక్ మస్తాన్ భీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పీడీ విజయేంద్ర ప్రసాద్ కి గురువారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ షేక్ మస్తాన్ బి కుటుంబాన్ని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిబంధనల మేరకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.