గ్యాంగ్ రేప్ చేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. శనివారం కదిరి పట్టణంలోని స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లి గ్రామంలో బళ్లారి నుండి ఉపాధి కోసం వచ్చిన కుటుంబం వాచ్ మెన్ తో పాటు ఆయన కుమారుని కత్తులతో బెదిరించి అత్త, కోడలిపై అత్యాచారానికి పాల్పడం బాధాకరమన్నారు. దుండగులను పట్టుకొని శిక్షించాలని కోరారు.