శ్రీసత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం కుక్కంటి క్రాస్ బాలసముద్రం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100రోజుల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు గురించి వివరించారు.