శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలానికి చెందిన ఎస్. ఆనంద్ కుమార్‌ను నూతన ఈఓఆర్డిగా నియమిస్తూ గ్రామపంచాయతీ శాఖ అధికారులగురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కోడిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లేపాక్షి మండలంలో ఈఓఆర్డి హోదాలో బాధ్యతలు స్వీకరించనున్నారు.