హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో అత్తా కోడలిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో బాధితుల రక్షణ, భద్రత, వారి ఆరోగ్యం తమకు ముఖ్యమని హిందూపురం డీఎస్పీ మహేష్ పేర్కొన్నారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోందని, దీని వల్ల బాధితుల అంతరాయానికి ఇబ్బందులు కలిగించవద్దని డి. ఎస్. పి ఆదివారం తెలిపారు.