ధర్మవరంలో లేబర్ కార్యాలయం ప్రారంభించండి: సీఐటీయూ

68பார்த்தது
ధర్మవరంలో లేబర్ కార్యాలయం ప్రారంభించండి: సీఐటీయూ
ధర్మవరం పట్టణంలో లేబర్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ ధర్మవరం డివిజన్ కార్యదర్శి జేవీ రమణ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రమణ మాట్లాడుతూ 40 వేల మంది కార్మికులు ఉన్న ధర్మవరంలో లేబర్ కార్యాలయం లేకపోవడం ఇబ్బందిగా ఉందని గతంలో ఉన్న కార్యాలయాన్ని కొత్త చెరువుకి మార్చారని, తిరిగి ధర్మవరంలో నెలకొల్పాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி