ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంట కూడలి నందు గల శిశు సంక్షేమ శాఖ కార్యాలయం దగ్గర ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు ఆదివారం తెలిపారు. భీమనేని నారమ్మ జ్ఞాపకార్థం కిమ్స్ సవేరా ఆసుపత్రి వైద్యులచే ఉచిత గుండె వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా గల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.