అనంతపురం: రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక"లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి 253 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సరియైన పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పెండింగ్ ఉంచకుండా సకాలంలో అర్జీలకు పరిష్కారం చూపించాలన్నారు.