దసరా పండుగను పురస్కరించుకుని అనంతపురంలోని 16వ డివిజన్ కన్వీనర్ సుకేశ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి శుక్రవారం దుస్తులు పంపిణీ చేశారు. ప్రతి ఏటా దసరా పండుగ నాడు పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని
వైసీపీ శ్రేణులు తెలిపారు. కార్యక్రమంలో
వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.