దుత్తలూరు: గత ఐదేళ్ళు ఎక్కడ ఉన్నారు.?
దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు రాజకీయాలపై మహేంద్రబాబు మోడీ పెదవి విరిచారు. గురువారం వారు మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి రాగానే అంతా మేమనే నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. గత ఐదేళ్ళలో పెన్షన్లు, పథకాలు పోగొట్టుకుని గ్రామస్తులు ఎంతో క్షోభ అనుభవించారని ఎప్పుడైనా ప్రజల సమస్యల తరపున నిలిచారా అంటూ నిలదీశారు. మా మాటే చెల్లాలనే అహంకారపూరిత ధోరణి సరికాదని సాయమంటూ వచ్చేవారికి రాజకీయాలకు అతీతంగా సాయం చేయాలని కోరారు.