దుత్తలూరు మండలం, నర్రవాడ గ్రామంలో వేంచేసియున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో విజయదశమి సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో శనివారం ఆలయ అర్చకులుచే ఉదయం అభిషేకం కార్యక్రమము, ప్రత్యేక చందన అలంకారము, కుంకుమార్చన, పల్లికిసేవ, మహనైవేద్యము కార్యక్రమములు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగళ్ళు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.