ఉదయగిరి మండలం అప్పసముద్రం గ్రామంలో వెలుగొండ సాధన సమితి సభ్యులు, గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దస్తగిరి అహ్మద్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి పరిసర ప్రాంతాలకు ఎంతో అవసరం అన్నారు. ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించడం ద్వారానే ఈ ప్రాజెక్టు సహకారం అవుతుందని ప్రజా ప్రతినిధులు, ప్రజలందరూ దీనిపై పోరాడాలన్నారు. అందరూ సహకరించడం ద్వారా ఈ కార్యక్రమం ముందుకు వెళుతుందన్నారు.