ఉదయగిరి సర్కిల్ పరిధిలో మద్యం దుకాణాల కోసం 115 దరఖాస్తులు

81பார்த்தது
ఉదయగిరి సర్కిల్ పరిధిలో మద్యం దుకాణాల కోసం 115 దరఖాస్తులు
నెల్లూరు జిల్లా ఉదయగిరి సర్కిల్ పరిధిలో మద్యం షాపులు కొరకు 115 దరఖాస్తులు వచ్చినట్లు సీఐ తన్నీరు లక్ష్మణ్ స్వామి గురువారం తెలిపారు. ఉదయగిరి మండలంలో 3 షాపులకు గాను 17, సీతారాంపురం మండలంలో 2 షాపులకు గాను 17, దుత్తలూరు మండలంలో 2 షాపులకు గాను 41, మర్రిపాడులో 5 షాపులకు గాను 40 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. రేపు సాయంత్రం 7 గంటల లోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.

தொடர்புடைய செய்தி