జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు పొదలకూరు సర్కిల్ పరిధిలో 17 మద్యం దుకాణాలకు గెజిట్ విడుదల చేశామని వీటికి సంబంధించిన అప్లికేషన్లను ఈ నెల 1 నుండి 9వ తేది వరకు జిల్లా లోని అన్ని ఎక్సైజ్ స్టేషన్ లో తీసుకుంటారని పొదలకూరు ఎక్సైజ్ సీ. ఐ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడారు.