దీపావళి పండుగను పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపోత్సవం వైభవంగా జరుగుతోంది. సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాలను వెలిగించారు. లేజర్, డ్రోన్ షోలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కోసం దీపోత్సవంలో భాగంగా వెలిగించిన దీపాలను డ్రోన్ల సహాయంతో లెక్కిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.