దీపావళి సందర్భంగా అయోధ్యలోని సరయూ నది తీరాన దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. లక్షల ప్రమిదలతో సరయూ తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ క్రమంలో రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది. 25.12 లక్షల దీపాలు వెలిగించడం, అత్యధిక మంది ఏకకాలంలో దీపాలతో ప్రదర్శనకుగాను రికార్డులు సాధించింది. గిన్నిస్ ధ్రువీకరణ పత్రాలను ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అందుకున్నారు.