డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా శనివారం నగరంలోని మూలపేట శివాలయంలో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో.. ప్రాయశ్చిత గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరారు.