నెల్లూరు నగరంలోని వాహబ్ పేట ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ గాయపడి నారాయణ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న డ్రైనేజీ కార్మికుడు జి. పెంచలయ్యను మేయర్ శ్రావంతి జయవర్ధన్ గురువారం పరామర్శించారు.బుధవారం, వాహబ్ పేట ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఈ ఘటనలో కార్మికుడు జి. పెంచలయ్య చేతి రెండు వేళ్ళకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.