నేడు నెల్లూరుకు రానున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

66பார்த்தது
నేడు నెల్లూరుకు రానున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం నెల్లూరు రానున్నారు. నెల్లూరులోని పినాకిని గెస్ట్ హౌస్ లో మధ్యాహ్నం 12: 30 నుంచి 1. 30 గంటల వరకు ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటారు. 2: 30 గంటలకు బిజెపి పార్టీ కార్యాలయంలో నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహిస్తారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. ఈ మేరకు ఆయన వ్యక్తిగత కార్యదర్శి కృష్ణప్ప వివరాలను వెల్లడించారు.

தொடர்புடைய செய்தி