ప్రతి రైతు తాము వేసిన పంటకు సంబంధించి ఈ పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి వెంకట కృష్ణయ్య కోరారు. ఈ పంట నమోదు కార్యక్రమం పై శుక్రవారం విడవలూరు మండలంలోని వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులకు ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విస్తరణ అధికారులు మండలంలోని ప్రతి రైతు వద్దకు వెళ్లి ఈ పంట నమోదును తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.