జిల్లాలో భారీ వర్షాలు కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట కృష్ణయ్య కోరారు. విడవలూరు మండలంలోని చౌకచర్ల మరియు దండిగుంట గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కారణంగా రెండు రోజులు పాటు మండలంలో ఏ రైతు కూడా వరి నాట్లు వేయకూడదని సూచించారు. పలువురు విస్తరణ అధికారులు పాల్గొన్నారు.