ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మంగళవారం పర్యటించారు. పలు ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆయన వాటర్, భోజనం అందజేశారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడతామని తెలిపారు. వీలైనంత త్వరగా విజయవాడలోని వర్షపునీరు తొలగించేందుకు కృషి చేస్తున్నామన్నారు.