రోడ్లమీద ఉన్న గుంతలను పూడ్చాలని కోరుతూ స్థానికులు ఆదివారం నిరసన తెలిపారు. ఒంగోలు నగరంలోని 50వ డివిజన్ లో జయప్రకాష్ కాలనీ ఎక్స్టెన్షన్ రహదారి మీద గుంతలు పూడ్చాలని ఆదివారం కాలనీవాసులు నిరసన తెలిపారు. సిపిఎం నగర కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ వర్షాల వలన రహదారుల మీద గుంతలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయని ప్రజలు నడవడానికి ఇబ్బందిగా ఉందన్నారు.