ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మంగళవారం సాయంత్రం బేటి అయ్యారు. ఒంగోలులోని ప్రకాశం భవన్ లో కలెక్టర్ తో భేటీ అయ్యి ప్రజా సమస్యలపై చర్చించారు. కొండపి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సత్య కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు.