ఒంగోలులోని అగ్రహారం రైల్వే గేటు వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలు తీరినట్టే. అగ్రహారం రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే జనరల్ మేనేజర్ అనుమతించినట్లుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మాట్లాడుతూ రైల్వే శాఖ నిధులతో వంతెన నిర్మించాలని రైల్వే శాఖ ఆమోదించిందని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇచ్చారని పేర్కొన్నారు.