ఒంగోలు సాగునీటి సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనెల 5న విడుదల కానుంది. అనంతరం మూడు రోజులకు తొలుత డబ్ల్యూయూఏలకు, తర్వాత డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలను నిర్వహిస్తారు. ఆ మేరకు సవరించిన షెడ్యూల్‌పై జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. అందుకు వీలుగా జిల్లాలో 342 డబ్ల్యూయూఏలు, ఎన్నికల అధికారుల నియామకం, వారికి శిక్షణ వంటి అంశాలను అటు రెవెన్యూ, ఇటు ఇరిగేషన్ అధికారులు పూర్తిచేశారు.