పొన్నులూరు మండలం ముండ్లమూరి వారి పాలెం గ్రామంలో సోమవారం మద్యం బెల్టు షాపుపై ఎస్సై అనూక్ ఆకస్మిక దాడులు నిర్వహించి 26 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బెల్ట్ షాపు ఏర్పాటు చేసుకొని మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. మండలంలో ఎక్కడైనా మద్యం బెల్టు షాపులు నిర్వహిస్తుంటే 100 నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.