డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు

59பார்த்தது
కనిగిరి పట్టణంలో దశలవారీగా డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లుగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. పట్టణంలోని ఐదవ వార్డులో బుధవారం మున్సిపల్ చైర్మన్ పర్యటించగా, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని స్థానికులు చైర్మన్ ను కోరారు. 5వ వార్డుతో పాటు పట్టణంలో డ్రైనేజీ కాలువలు లేని ప్రాంతాల్లో దశల వారిగా వాటి నిర్మాణాలను చేపట్టి పూర్తి చేస్తామని మున్సిపల్ చైర్మన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி