ప్రజల రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడకుండా నూతన బ్రిడ్జిని నిర్మిస్తామని తహసిల్దార్ దిలీప్ తెలిపారు. హనుమంతునిపాడు మండలంలోని హనుమంతపురం ఎస్సీ కాలనీ నుండి కొత్తపల్లికి వెళ్లే రహదారిలో భారీ వర్షాలకు వాగు ఉధృతికి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాకపోకలు స్తంభించిపోవటంతో సమాచారం అందుకున్న తహసిల్దార్ దిలీప్ అక్కడికి చేరుకొని ప్రజలతో మాట్లాడి సమస్యను త్వరలో తీరుస్తామని తెలిపారు.