కందుకూరు: కరెంట్ షాక్ తో యువకుడి మృతి
కందుకూరు నియోజకవర్గంలో విషాద ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే యువకుడు ఉలవపాడు మండలం సముద్ర తీర గ్రామం బట్టి సోమయ్య పాలెంలోని సంధ్య హేచరీస్ లో పనిచేస్తున్నారు. ఈక్రమంలో నీరు పెట్టేందుకు సముద్రం దగ్గరలో ఉన్న షెడ్ వద్ద మోటార్ స్విచ్ వేశాడు. దీంతో శ్రీనివాసరావుకు కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని ఎస్సై అంకమ్మ సోమవారం తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.