గిద్దలూరు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని 13 దుకాణాలకు మంగళవారం నాటికి 103 టెండర్లు వచ్చినట్లుగా సీఐ జయరావు తెలిపారు. బుధవారం నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఆఖరి రోజు అని ఆయన తెలిపారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో కానీ ఆన్లైన్ లో నూతన మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. 10వ తేది దరఖాస్తులను పరిశీలించి 11వ తేదీన లక్కీ డిప్ ద్వారా మద్యం షాపులు కేటాయింపులు జరుగుతాయన్నారు.