పెద్దదోర్నాల నల్లమల్ల అభయ అరణ్యంలో అలుగును వేటాడి అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 5వ తేదీన దాసరి బుడ్డన్న అలుగును వేటాడి బయన్నకు సమాచారం ఇచ్చాడు. బయన్న అలుగును అమ్మేందుకు మరో ముగ్గురిని సంప్రదించాడు. విషయం బయటికి పొక్కడంతో అటవీశాఖ అధికారులు మంగళవారం ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారి మునిర్ తెలిపారు.